డైరెక్టర్ గుణశేఖర్ ఇంట పెళ్లి సందడి

-

టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. గుణశేఖర్ కుమార్తె నీలిమ నిశ్చితార్థం వేడుక హైదరాబాద్ లో చోటుచేసుకుంది. భాగ్యనగరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో రవి ప్రఖ్యాతో నీలిమ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. కాబోయే భర్తను పరిచయం చేస్తూ నీలిమ సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేసింది.

ఇది ఇలా ఉండగా.. మహా భారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతున్న తాజా సినిమా శాకుంతలం. ఈ శాకుంతలం సినిమాను.. టాలీవుడ్‌ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌ లో తెరకెక్కుతోంది. గ్రాపిక్స్‌ కు ఎంతో ప్రాధాన్యమున్న సినిమా ఇది అని సమాచారం అందుతోంది. ఈ సినిమా గుణ శేఖర్‌ పాన్‌ ఇండియా లెవెల్లో రిలీజ్‌ చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news