భారతీయుడు – 2 ప్రమాదం పై శంకర్ ఉద్వేగభరిత ట్వీట్…!!

కోలీవుడ్ దర్శక దిగ్గజం శంకర్ షణ్ముగం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సిద్దార్థ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ లో కొద్దిరోజుల క్రితం ఒక ఘోర ప్రమాదం జరిగి, సెట్ లోని భారీ క్రేన్ విరిగి పడి సెట్ లోని వారిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మారుతీ చెందారు. అయితే ఆ దుర్ఘటనతో ఒక్కసారిగా కోలీవుడ్ తో పాటు మిగతా సినిమా పరిశ్రమలు కూడా ఉలిక్కిపడ్డాయి.

అయితే ఆ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్ధిక సాయాన్ని అందించిన కమల్ హాసన్, ఈ డబ్బు చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేదని తనకు తెలుసునని, వారి కుటుంబాలకు నా ప్రగఢ సానుభూతిని తెలియచేస్తున్నానని కమల్ అన్నారు. ఇక ఆ ప్రమాద ఘటనలో కొంత గాయపడ్డ దర్శకుడు శంకర్, ఎట్టకేలకు కాసేపటి క్రితం ట్విట్టర్ లో ఒక ట్వీట్ ద్వారా స్పందించారు.

 

జరిగిన దుర్ఘటన తాను ఎప్పటికీ మరిచిపోలేనని, ఆ ఘటన జరిగి ఆ ముగ్గురు చనిపోయిన దగ్గరి నుండి తనకు నిద్ర పట్టడం లేదని శంకర్ అన్నారు. ఒకవేళ జరిగిన ప్రమాద ఘటనలో కూలిన క్రేన్ తన మీద పడి ఉంటె బాగుండేదని శంకర్ ట్వీట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేసారు. అయితే శంకర్ ఆవేదనను గ్రహించిన నెటిజన్లు, జరిగిన ఘటన యాదృచ్చికంగా జరిగింది. దానికి ఎవరూ ఏమి చేయలేరు, మీరు అధైర్య పడకండి, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అంటూ ఆయనకు ధైర్యం చెపుతూ ట్వీట్స్ చేస్తున్నారు…..!!