ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించిన మూవీ పుష్ప. ఈ చిత్రం ఎంతటి సంచలనం నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సీక్వెల్ గా పుష్ప-2ని తెరకెక్కించారు డైరెక్టర్ సుకుమార్. పుష్ప-2 మూవీ డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పుష్ప టీమ్ కి దాదాపు ఐదు సంవత్సరాల జర్నీ. ఇంకా ముందు ముందు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. పుష్పలో పని చేసి ప్రతీ టెక్నిషియన్స్ కి నా మనస్పూర్తిగా ఏమి చెప్పినా తక్కువే అన్నారు. పుష్ప2 ఈ రేంజ్ లో మీకు చేరిందంటే.. దానికి మీరిచ్చిన సపోర్టుతోనే అన్నారు. ఇలాగే ముందు ముందు కూడా ఇలాంటి జర్నీని కొనసాగించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.