చిరంజీవి ఫేవరెట్ పవన్ కల్యాణ్ పిక్చర్ ఇదే..

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ తను నటిస్తున్న సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ఫిల్మ్స్ తో పాటు పాలిటిక్స్ లో ఉండటం వలన ఆయన ఇంకా ఫుల్ బిజీ అని చెప్పొచ్చు. ఇక పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని తండ్రిలాగా భావిస్తుంటారు. తన ఫేవరెట్ హీరో చిరంజీవి అని చెప్తుంటారు. కాగా, చిరంజీవికి నచ్చిన పవన్ కల్యాణ్ చిత్రమేదో ఈ రోజు తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆయనకంటూ ఓ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అశేష అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. కాగా, చిరంజీవికి పవన్ కల్యాణ్ నటించిన ‘తమ్ముడు’ చిత్రమంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు తన సన్నిహితుల వద్ద చెప్పారు.

‘తమ్ముడు’ చిత్రం కోసం పవన్ కల్యాణ్ చాలా కష్టపడ్డారు. మార్షల్ ఆర్ట్స్ తో పాటు రియల్ ఫైట్స్ చేసి జనాలను మెప్పించారు పవన్ కల్యాణ్. అలా సినిమా ఫైట్స్ లో ట్రెండ్ సెట్ చేశారు జనసేనాని. ‘తమ్ముడు’ చిత్రంలో ‘శకుంతల అక్కయ్య’ అంటూ పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్స్ , జోక్స్ చూసి జనాలు ఇప్పటికీ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

ఈ సీన్లు చిరంజీవికీ చాలా ఇష్టమట. పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ లో త్వరలో పాల్గొననున్నారు. ఇక చిరంజీవి ఈ విజయ దశమికి ‘గాడ్ ఫాదర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news