ఊహ కుటుంబానికి హీరో శ్రీకాంత్ ఊహించని ట్విస్ట్..తర్వాత!!

-

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్..ప్రజెంట్ హీరోగా పలు సినిమాలు చేస్తూనే మరో వైపున విలన్, సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇటీవల విడుదలైన బాలయ్య ‘అఖండ’ పిక్చర్ లో భయంకరమైన విలన్ గా కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందారు. మరో వైపున పలు సినిమాల్లో కీలక పాత్రలతో పాటు హీరోగానూ నటిస్తున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే..హీరో శ్రీకాంత్ ..తన సరసన హీరోయిన్ గా నటించిన ఊహను మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, మ్యారేజ్ కు ముందర ఊహ కుటుంబానికి శ్రీకాంత్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? వారి ‘లవ్ స్టోరి’ ఎక్కడ మొదలైందన్న సంగతులు తెలుసుకుందాం.

Hunter Telugu Movie Stills Photos

ఆన్ స్క్రీన్ కపుల్ గా నటించిన శ్రీకాంత్ -ఊహ..ఆ తర్వాత కాలంలో ఆఫ్ స్క్రీన్ కూడా అనగా..రియల్ లైఫ్ కపుల్ అయిపోయారు. వీరిరువురు జంటగా ‘ఆమె’,‘కూతురు’,‘ఆయన గారు’ చిత్రాల్లో నటించారు. తొలి చిత్రం ‘ఆమె’ ముహుర్తపు షాట్ లో ఊహ, శ్రీకాంత్ ఒకరికి మరొకరు పరిచయం అయ్యారు. అలా ఆ పరిచయం కాస్త తర్వాత కాలంలో ప్రేమగా మారింది.అది కాస్త వివాహ బంధం అయింది.

ఇక సినిమాలో మాదిరిగానే హీరో శ్రీకాంత్ రియల్ లైఫ్ లో ‘లవ్ స్టోరి’ నడిపించారు. ఊహ వాళ్ల ఇంటికి వెళ్లి మరి వారి కుటుంబ సభ్యుల మధ్య ఊహకు ప్రపోజ్ చేశాడట. అది ఊహ కుటుంబానికి అస్సలు ఊహించని ట్విస్ట్ అయిపోయింది. ఒక రోజు ఊహ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు ఉండగానే ఊహను దేవుడి గదిలోకి తీసుకెళ్లి ‘నేను ఊహను ప్రేమిస్తున్నా’ అని చెప్పి ..తన మెడిలోని బంగారు గొలుసు ఆమె మెడలో వేశాడట హీరో శ్రీకాంత్. అది చూసి ఊహ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయి నిశ్శబ్దంగా ఉండిపోయారు. అలా వీరిరువురి వివాహం జనవరి 20, 1997 లో జరిగింది. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇటీవల ‘పెళ్లి సందD’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news