లైఫ్‌లో మూవ్ ఆన్ కావడం కోసం ఆ బుక్ చదివేస్తున్న సమంత..?

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగచైతన్యతో డైవోర్స్ తీసుకున్న సంగతి అందరికీ విదితమే. ఇటీవల బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తో ‘కాఫీ విత్ కరణ్’షోలో తన వ్యక్తిగత జీవితం గురించి సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. సమంత కామెంట్స్ సబబేనా అన్న విషయమై సోషల్ మీడియాలో నెటిజన్లు డిస్కషన్ కూడా చేసుకున్నారు. కాగా, తాజాగా సమంత ఫొటో ఒకటి ప్రజెంట్ నెట్టింట చర్చనీయాంశమవుతున్నది.

సమంత-నాగచైతన్య బ్రేకప్ వ్యవహారం మళ్లీ నెట్టింట హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మరిచిపోతున్న గతాన్ని కరణ్ జోహార్ కాఫీ షోలో కెలకడంతోనే నెట్టింట సంచలనంగా మారింది. టాక్ షో వేదికగా సమంత ఈ విషయంపై చై గురించి వ్యక్తిగతంగా కామెంట్ చేయడంతో చైతన్య కూడా కామ్ గా లేడు. తనదైన శైలిలో బధులిచ్చే ప్రయత్నం చేసాడు.

సదరు ఫొటోలో సమంత చేతిలో ఓ బుక్ తో కనబడింది. ముంబైలో ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది. వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్న సమంత.. లూయిస్ హే రాసిన ‘యూ కెన్ హీల్ యువర్ లైఫ్’ అనే బుక్ ను తన వెంట క్యారీ చేస్తోంది. ఇక నాగచైతన్య జ్ఞాపకాల నుంచి మూవ్ ఆన్ కావడం కోసమే సమంత ఇలా చేస్తుందా? అన్న సందేహం ఆ బుక్ చూసిన నెటిజన్లు అనుకుంటున్నారు.

మానవ జీవితంలో వివిధ భిన్నమైన కోణాలు ఆవిష్కరించే రచనలు చేసిన లూయిస్ హే రచించిన ఆ పుస్తకంలో అన్ని రకాల అంశాలుంటాయి. ఆ బుక్ చదవడం ద్వారా సమంత..తన వ్యక్తిగత జీవితంలో మూవ్ ఆన్ కావాలని అనుకుంటున్నట్లుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే సమంత తన ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టిందన్న సంగతి ఇప్పటికే స్పష్టమవుతోంది. ఆమె నటించిన ‘శాకుంతలం’ త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ‘యశోద’, ‘ఖుషి’ చిత్రాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉంది సమంత.