టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ..‘పుష్ప’ పిక్చర్ తో పాన్ ఇండియా స్టార్ ప్లస్ ఐకాన్ స్టార్ అయిపోయారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ పిక్చర్ హిందీ బెల్ట్ లో బ్లాక్ బాస్టర్ అయిపోయింది. సినీ ప్రేక్షకులతో పాటు ఫిల్మ్ మేకర్స్ కు ఈ మూవీ విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
‘పుష్ప’ రాజ్ గా అల్లు అర్జున్ అభినయం నెక్స్ట్ లెవల్ అని చెప్తున్నారు సినీ లవర్స్. ‘తగ్గేదేలే’ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండవుతుండటం విశేషం. ‘పుష్ప’ మేనియా ఇంకా కొనసాగుతున్నది కూడా. ఇక ఈ ఫిల్మ్ సీక్వెల్ ‘పుష్ప-2’ త్వరలో స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు ప్లాన్ చేసిన మేకర్స్…సినిమాలో నటీనటుల కోసం వెతుకుతున్నారు.
‘పుష్ప-1’ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ‘పుష్ప-2’ స్టోరిపైన డైరెక్టర్ సుకుమార్ ఇంకా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్ట్ టూ కోసం భారీ బడ్జెట్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. రూ.350 కోట్ల బడ్జెట్ సీక్వెల్ కోసం ఫిక్స్ చేశారని టాక్.
పార్ట్ వన్ కు రూ.45 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్న బన్నీ..ఈ సారి వంద కోట్ల తీసుకుంటున్నట్లు టాక్. ఈ విషయం తెలుసుకుని సినీ అభిమానులు, మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. బన్నీ రేంజ్ పెరిగిన నేపథ్యంలో అంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని అంటున్నారు. ప్రజెంట్ ‘పుష్ప-2’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు వినికిడి.