చాలా మంది స్టార్ హీరోలు తమ కెరీర్ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు పోషించారు. కొంత మంది అయితే విలన్ రోల్స్ ప్లే చేశారు. ఆ తర్వాత వారికి చక్కటి అవకాశం దొరికిన క్రమంలో వారు హీరోలుగా నటించారు. అలా ఆ తర్వాత వారు స్టార్ హీరోలు అయిపోయారు. ఆ జాబితాలో చాలా మంది ఉండగా, లేటెస్ట్ గా టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు చేరారు.
రామ్ చరణ్, నాగచైతన్యల సినిమాల్లో చిన్న పాత్ర పోషించిన ఆ వ్యక్తి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో అయిపోయారు. ఆయన ఎవరో కాదు..DJ టిల్లు అలియాస్ సిద్ధు జొన్నగడ్డల.. యూత్ కు ఫేవరెట్ అయిపోయిన ఈ స్టార్ హీరో..తన కెరీర్ లో ఎంతో కష్టపడి ఇప్పుడు స్టార్ హీరో స్టేటస్ పొందారు. తన కెరీర్ స్టార్టింగ్ డేస్ లో సైడ్ రోల్స్ ప్లే చేసిన సిద్ధు..ఇప్పుడు హీరోగా ఫిల్మ్స్ చేస్తున్నాడు.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య ‘జోష్’మూవీ తో సినీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సిద్దు జొన్నగడ్డల నెగెటివ్ రోల్ ప్లే చేశారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. రామ్ చరణ్..‘మగధీర’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చేసిన లవ్ స్టోరి ‘ఆరెంజ్’లోనూ సిద్ధు నటించాడు. ఇందులో జెనీలియా ముగ్గురిని లవ్ చేస్తున్నట్లు చూపించే వ్యక్తుల్లో ఒకరిగా సిద్ధు కనిపిస్తాడు. అయితే, ఈ పిక్చర్ భారీ అంచనాల నడుమ వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
రామ్ చరణ్, నాగచైతన్యల సినిమాల్లో సిద్ధు జొన్నగడ్డల కనిపించాడన్న సంగతి అయితే చాలా మంది గుర్తించి ఉండబోరు. కానీ, ఇటీవల విడుదలైన సక్సెస్ అయిన ‘DJ టిల్లు’ పిక్చర్ తో జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.
ఇందులో సిద్ధు జొన్నగడ్డల యాక్టింగ్, స్టైల్, యాటిట్యూడ్ చూసి యూత్ అయితే ఫిదా అయిపోయింది. సిద్ధు జొన్నగడ్డల ప్రజెంట్ తన నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫోకస్ పెట్టారు.