పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. స్టార్ హీరోనే కాదు టెక్నీషియన్ అన్న సంగతి ఆయన అశేష అభిమానులకు, సినీ ప్రియులకు తెలుసు. ‘జానీ’ సినిమాకు స్వయంగా పవన్ కల్యాణ్ యే దర్శకత్వం వహించి హీరోగా నటించారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫిల్మ్ కు స్టోరి అందించారు. నిజానికి తాను టెక్నీషియన్ గానే సినిమా ఇండస్ట్రీలో ఉండాలనుకున్నానని చాలా సార్లు పవన్ కల్యాణ్ చెప్పారు.
పవన్ కల్యాణ్ టెక్నీషియన్ కావాలని అనుకున్నప్పటికీ ఆయన కు తొలి సినిమా నుంచి వచ్చిన విశేష ఆదరణ వలన తర్వాత అనతి కాలంలోనే స్టార్ హీరో అయిపోయారు. ప్రజెంట్ హీరోగా, పొలిటీషియన్ గా ఆయన ఉన్నారు. అయితే, నిజానికి పవన్ కల్యాణ్ తన దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయాలని అనుకున్నారు. రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’ విడుదలయిన క్రమంలో చేసిన ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు పవన్ కల్యాణ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘చిరుత’ సినిమా విడుదల తర్వాత పవన్ కల్యాణ్ ..రామ్ చరణ్ లను యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేసింది. అందులో తన వద్ద రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే ఆలోచన ఉందని చెప్పారు. కానీ, ఆ తర్వాత కాలంలో బిజీ షెడ్యూల్స్, కమిట్ మెంట్స్ వలన అది జరగలేదు. ఇక ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ టైమ్ లో తన ప్రొడక్షన్ హౌజ్ లో రామ్ చరణ్ హీరోగా సినిమా ఉంటుందని పవన్ చెప్పారు. కానీ, అది కూడా ఫైనల్ కాలేదు.
మొత్తానికి బాబాయ్-అబ్బాయి… పవన్ కల్యాణ్, రామ్ చరణ్ కాంబినేషన్ మూవీ మెటీరియలైజ్ అయితే కాలేదు. ప్రజెంట్ ఇద్దరూ తమ ఫిల్మ్ కమిట్ మెంట్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. భవిష్యత్తులో అయినా ఈ కాంబో వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.