‘రామారావు ఆన్ డ్యూటీతో’ రీ ఎంట్రీ ఇస్తున్న వేణు తొట్టెంపూడి భార్య ఎవరో మీకు తెలుసా?

-

టాలీవుడ్ నవ్వుల రారాజు..హీరో వేణు తొట్టెంపూడి చాలా కాలం తర్వాత మళ్లీ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. మాస్ మహారాజ రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ఫిల్మ్ డెఫినెట్ గా సక్సె్స్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో రవితేజ రెవెన్యూ ఆఫీసర్ గా నటిస్తుండగా, వేణు తొట్టెంపూడి సీఐ మురళిగా కనిపించనున్నారు.

చాలా కాలం తర్వాత వేణు తొట్టెంపూడి వెండితెరపైన చూడబోతున్నందుకు ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతున్నారు. తన కామెడీ టైమింగ్ తో జనాలను కడుపుబ్బ నవ్వించిన వేణు..ఈ సినిమాలో సీరియస్ రోల్ ప్లే చేసినట్లు తెలుస్తోంది. వేణు తొట్టెంపూడి తెలుగు ప్రేక్షకులకు చివరగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రంలో కనిపించాడు.

ఈ సంగతులు పక్కనబెడితే..వేణు తొట్టెంపూడి మచిలీపట్నం మాజీ ఎంపీ మాగంటి అంకినీడు మేనల్లుడు అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక ఆయన వైవాహిక జీవితం విషయానికొస్తే..వేణు తొట్టెంపూడి..ఫిల్మ్స్ లో చాలా బిజీగా ఉన్న టైమ్ లోనే అనుపమ చౌదరి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఒక కూతురితో పాటు ఒక కుమారుడు ఉన్నారు. వేణు తొట్టెంపూడి ఇకపైన సినిమాల్లో ఫుల్ బిజీ అవుతారని ఈ సందర్భంగా సినీ ప్రేక్షకులు అంటున్నారు.

తన మార్క్ కామెడీ టైమింగ్ తో అప్పట్లో జనాలను ఎంటర్ టైన్ చేసిన వేణు తొట్టెంపూడి..ఇప్పుడు కూడా అలానే చేయగలరని సినీ లవర్స్ అంటున్నారు. సీరియస్ రోల్స్ కూడా ప్లే చేసే సత్తా వేణుకు ఉందని, దర్శకులు వేణుకు చక్కటి అవకాశాలు ఇస్తే సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఆయన సత్తా చాటుతారని అభిప్రాయపడుతున్నారు సినీ పరిశీలకులు.

Read more RELATED
Recommended to you

Latest news