గోపీచంద్ లవ్ ప్రపోజ్ ని రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా ఎదిగిన హీరో గోపీచంద్ ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాలో నటించాడు. ఈ సినిమా జులై 1వ తేదీ గా థియేటర్లో విడుదల కానుంది. ఈ సినిమా ఫలితం కోసం ఇండస్ట్రీ వర్గాలు సైతం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా వైపు కాస్త చూస్తేనే ఈ సినిమా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న గోపీచంద్ పలు విషయాలను తెలిపారు.గోపీచంద్ రహస్యాలు బయటపెట్టారు. గోపీచంద్ మాట్లాడుతూ చిన్న వయసులోనే తనకోసం తన తండ్రి ఒంగోలులో స్కూలు పెట్టారని.. తనకు తొమ్మిదేళ్ళ వయసు ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయారని ఆ తరువాత పరిస్థితులన్నీ మారిపోయాయని తెలిపారు. నాన్న లేని లోటు వల్ల మనుషులు ఎలా ఉంటారో తెలియడంతో పాటు మరింత స్ట్రాంగ్ గా మారిపోయానని గోపీచంద్ తెలిపారు. బీటెక్ పూర్తి అయిన తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని దాదాపుగా ఇప్పటివరకు 30 సినిమాలకు పైగా నటించానని తెలిపారు.

అయితే మొదట తొలివలపు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చానని తెలిపారు. అయితే తన చదువుకునే సమయంలో ఒక రష్యన్ అమ్మాయి నచ్చిందని..ఆ అమ్మాయిని వివాహం చేసుకుందామని .. అడిగేయాలని అనిపించడంతో ఆమెను అడిగేసానని.. కానీ ఆ అమ్మాయి నేను చెప్పిన మాటలను విని నా దేశం వేరు నీ దేశం వేరు తమ కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారని ఆమె తెలిపినట్లుగా గోపీచంద్ తెలిపారు. కానీ ఆమె మాటలు విని నేను కూడా సరే అని తెలిపానని తెలిపారు. దాదాపుగా ఇది 20 సంవత్సరాల క్రితం జరిగిన లవ్ ఫెయిల్యూర్ ఘటనని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version