సాహో భామ ఎంగేజ్‌మెంట్ ఫిక్స్‌

బాలీవుడ్ సినిమాల్లో న‌టించిన భామ‌లు ఒక్కొక్క‌రు పెళ్లి పీఠ‌లు ఎక్కేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ సినిమాల ద్వారా ప‌రిచ‌యం అయిన మ‌రో భామ సైతం పెళ్లి పీఠ‌లు ఎక్కేస్తోంది. త‌న ప్రియుడిని ఆమె పెళ్లాడ‌నుంది. ఇంత‌కు ఆమె తెలుగులో ఇటీవ‌ల ఓ క్రేజీ సినిమాతో కూడా మ‌న‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఆమె ఎవ‌రో కాదు… సాహోలో తన నటనతో ఆకట్టుకున్న జర్మన్‌ బ్యూటీ ఎవెలిన్‌ శర్మ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

ఆమె కొద్ది రోజులుగా త‌న ఆస్ట్రేలియ‌న్ ప్రియుడితో డేటింగ్ చేస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్‌ సర్జన్‌ తుషన్ బైనాండితో తన ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్టు ఎవెలిన్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. సిడ్నీలోని ప్రముఖ హార్బర్‌ బ్రిడ్జి బ్యాక్‌డ్రాప్‌లో తుషన్‌తో రోమాంటిక్‌గా దిగిన ఓ ఫొటోను కూడా ఆమె త‌న సోష‌ల్ మీడియా అక్కౌంట్‌లో పోస్ట్ చేసింది.

సాహోలో ప్రభాస్ ప‌క్క‌న ఆమె బ్యాడ్ బాయ్ సాంగ్‌లో జాక్వాలైన్ ఫెర్నాండెజ్‌తో క‌లిసి ఆడిపాడింది. ఇక
ఎవెలిన్‌ తన ఎంగేజ్‌మెంట్‌ అయిందని ప్రకటించగానే అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో తనను విష్‌ చేసిన వారందరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. జర్మనీలో పుట్టి, పెరిగిన ఎవెలిన్‌ ‘ఫ్రమ్‌ సిడ్నీ విత్‌ లవ్‌’ అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు.