బిగ్ బాస్ చీక‌టి కోణం.. సుమ‌కి తెలుసు.. కానీ మాట మార్చిందా?

-

బిగ్ బాస్ లో చీక‌టి కోణాన్ని యూ ట్యూబ్ యాంక‌ర్ శ్వేతారెడ్డి బ‌ట్ట‌బ‌య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ రాసలీల‌లు ఎలా ఉంటాయో! మీడియా ముఖంగా త‌న‌కెదురైన అనుభ‌వాల‌ను బ‌య‌ట‌పెట్టింది. దీంతో బిగ్ బాస్ ద్వారా ఎంత‌మంది ఆడ‌వాళ్లు లైంగిక వేధింపుల‌కు గుర‌య్య‌రో అంటూ అంతా నోటి మీద వేలేసుకుంటున్నారు. బిగ్ బాస్ పేరుతో వీళ్లందా ఉద్ద‌రించేది ఇదేనా? అంటూ స‌ర్వత్రా విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ప‌నిలో ప‌నిగా ఆ షోను ఎంక‌రేజ్ చేస్తున్నా టాలీవుడ్ హీరోలు విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతున్నారు. ఆ విష‌యం ప‌క్క‌న‌బెడితే ఇందులో కంటెస్టెంట్ ఛాన్స్ పాపుల‌ర్ యాంక‌ర్ సుమ‌కి కూడా ద‌క్కింది.

బెల్లి తెర యాంక‌ర్ గా ఆమెకు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉండ‌టంతో ముందుగా ఆమెనే సంప్ర‌దించారు. అయితే సుమ టీవీ షోల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల అరుదైన అవ‌కాశాన్ని వ‌దులుకున్న‌ట్లు చెబుతున్నారు. కానీ అస‌లు కార‌ణం అది కాద‌ని వినిపిస్తోంది. బిగ్ బాస్ రాస‌లీల‌ల గురించి ఆమెకు ముందే తెలుసు కాబ‌ట్టి తెలివిగాఈ రీజ‌న్ చెప్పి త‌ప్పించుకుంద‌ని అంటున్నారు. ఎన్నో ఏళ్ల‌గా టీవీ రంగంలో ఉంది. ఎక్క‌డ ఏం జ‌రుగుతుతోంది ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? అని వినిపిస్తోంది. బిగ్ బాస్ మాటు వ్య‌వ‌హారాన్ని ప‌బ్లిక్ గా చెబితే ఆమె కెరీర్ కే ముప్పు వాటిల్లితుంద‌ని అందుకే అస‌లు విష‌యం దాచిపెట్టి ఇలా స్కిప్ కొట్టింద‌ని అంటున్నారు. ఆ షోను ప్ర‌సారం చేసేది స్టార్ మాటీవీ.

సుమ ఆ ఛాన‌ల్ స‌హా ప‌లు చాన‌ల్స్ లో యాంక‌రింగ్ చేస్తోంది. ఆ చాన‌ల్ లో టెలికాస్ట్ అయ్యే షో గురించి మాట్లాడితే అవ‌కాశాలు రావు. పైగా స్టార్ మా అనేది ఇప్పుడు స్టార్ గ్రూపు కు చెందిన‌ది. ఆ ప్ర‌భావం అక్క‌డికే ప‌ర‌మితం కాదు. మిగ‌తా షోస్ పైనా ప‌డుతోంది. ఇలా ఏ ర‌కంగా చూసినా బిగ్ బాస్ గురించి నెగిటివ్ ప్రచారం చేస్తే ఆమెకే న‌ష్టం. అందుకే బిజీ అంటూ బిస్కెట్ వేసింద‌ని అంటున్నారు. స‌హ‌జంగా ఇండ‌స్ర్టీ లో సీక్రెట్స్ తెలిసినా మ్యాగ్జిమ‌మ్ మౌనంగానే ఉంటారు. ప‌క్క‌వాడు వెన్ను పోటు పొడుస్తున్న విష‌యం తెలిసినా చెప్పని ఉద్దండులు చాలా మంది ఉన్నారు. నా క‌డుపు నిండితే చాలా ప‌క్కొడు ఏమైపోతే నాకేంటి? అనే స్వభావాలు క‌ల‌వారికి ఇక్క‌డ కొద‌వ‌లేదిక్క‌డ‌.

Read more RELATED
Recommended to you

Latest news