F3 ఫిల్మ్ తో టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఫ్యామిలీస్ కు ఈ సినిమా విపరీతంగా నచ్చుతోంది. థియేటర్లలో ఈ పిక్చర్ చూసి జనాలు హాయిగా నవ్వుకుంటున్నారు. మే 27న విడుదలైన ఈ సినిమాకు టాకీసుల్లో క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోందని చెప్పొచ్చు.
వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు చిత్రం రూ.46 కోట్లకు పైగానే షేర్ వసూళ్లు చేసింది. కాగా, ఈ చిత్రం OTTలోకి ఎప్పుడు వస్తుందా? అని కొందరు అభిమానులు ఎదరు చూస్తు్న్నారు. థియేటర్లో ఈ సినిమా చూడని వారు నెల రోజుల్లో డిజిటల్ వేదికగా వచ్చేస్తుంది కదా…అప్పుడే చూసేద్దాం అని అనుకుంటుండగా, వారికి ఎఫ్ 3 మూవీ టీమ్ షాక్ ఇచ్చింది.
అంత తొందరగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే చాన్సే లేదని చెప్పేశారు. ఈ మేరకు దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్‌లు వీడియో విడుదల చేశారు. ఎఫ్ 3 మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పార. మరో 8 వారాల వరకు ఎఫ్ 3 ఓటీటీకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ఫిల్మ్ ను తప్పకుండా థియేటర్లలోనే చూడాలని కోరారు.