ట్రెండ్ ఇన్: ‘గాడ్సే’గా సత్యదేవ్ ఇంటెన్స్ యాక్షన్..‘బ్లఫ్ మాస్టర్’‌ను మించిన విజయం!

-

రొటీన్ కు భిన్నంగా విభిన్న స్టోరిలను తెర మీదకు తీసుకొస్తున్నారు టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపున పెద్ద హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, సక్సెస్ ఫుల్ కాంబో సత్యదేవ్-గోపి గణేశ్ పట్టాభి కాంబోలో తెరకెక్కిన ఫిల్మ్ ‘గాడ్సే’. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ సూపర్ సక్సెస్ అయింది.

ఈ నెల 17న ‘గాడ్సే’ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇటీవల మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. అందులో సత్య దేవ్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్, పవర్ ఫుల్ డైలాగ్స్, మాస్ లుక్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘బ్లఫ్ మాస్టర్’ ను మించిన విజయం ఈ సారి రాబోతున్నదని అంటున్నారు.

యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ చిత్రం విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే చేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రూ.5 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్.

సీ.కల్యాణ్ ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ డెఫినెట్ గా బ్లాక్ బాస్టర్ అవుతుందని సినీ అభిమానులు అంటున్నారు. బ్రహ్మాజీ, సిజ్జు మీనన్ కీలక పాత్రలు పోషించగా, ఈ చిత్రానికి సునీల్ కశ్యప్, శాండీ అద్దంకి మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఈ సినిమా రూ.7.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. మొత్తంగా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news