టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి శాలిని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ” మేము తల్లిదండ్రులము అయ్యామని చెప్పడానికి సంతోషిస్తున్నాము. తల్లి, బిడ్డ ఇద్దరూ.. ఆరోగ్యంగా ఉన్నారు” అని ట్విట్ చేశాడు నితిన్.
దీంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2020 జూలై 26న హైదరాబాదులోని ఫలక్నామా ప్యాలెస్ లో నితిన్ షాలిని, కందుకూరి ల వివాహం జరిగింది. తన చిరకాల స్నేహితురాలు అయిన శాలినితో ప్రేమలో పడిన నితిన్ ఏడడుగుల బంధంతో కలిసి నడిచారు.
నాగర్ కర్నూల్ కి చెందిన డాక్టర్ దంపతులు సంపత్ కుమార్, నూర్జహాన్ ల కూతురు శాలిని. నితిన్ – శాలినిల వివాహం జరిగే సుమారు నాలుగేళ్లు అవుతుంది. ఇప్పుడు ఈ జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక నితిన్ జయం సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే.
https://x.com/actor_nithiin/status/1832026718376218767