బ్రేకింగ్; రజని కాంత్ పై విజయ్ సంచలన వ్యాఖ్యలు…!

తమిళ హీరో విజయ్ లక్ష్యంగా ఐటి అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజుల నుంచి విజయ్ ని లక్ష్యంగా చేసుకుని ఆయనకు సంబంధించిన పలు ఇళ్ళల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన ఫైనాన్షియర్, మేనేజర్ లను విచారించారు. ఇక భారీగా ఆయన ఇళ్ళపై అధికారులు సోదాలు చేస్తున్నారు. దీనితో ఒక్కసారిగా వాతావారణం మారిపోయింది. తమిళనాడులో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

ఇక ఇదిలా ఉంటే తాజాగా విజయ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. రజినీకాంత్ లా CAA కు అనుకూలంగా మాట్లాడి IT దాడుల నుండి తప్పించుకోగలను, నేను భారత రాజ్యాంగం కు బద్దున్ని, ఒక్క రూపాయి అవినీతి గా నా దగ్గర ఉంచుకోలేదు. కావాలని నన్ను ఇరికిస్తే నేను ఏమిచెయ్యలేను. కానీ నేను ద్రావిడున్ని. ఒక ఉత్తరాది మతతత్వ పార్టీ. బెదిరింపులకు భయపడి నా వ్యతికిత్వాన్ని దిగజార్చుకోను అన్నాడు విజయ్.

అయితే విజయ్ ఈ వ్యాఖ్యలు చేసాడా లేదా అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇదిలా ఉంటే ఆయన ఐటి దాడుల తర్వాత నైవేలి వద్ద గనుల్లో సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ షూటింగ్ ని బిజెపి కార్యకర్తలు అడ్డుకుని గనుల్లో షూటింగ్ ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. దీనితో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మొహరించారు.