ఒక్క సీన్ నచ్చలేదని ఇండస్ట్రీ హిట్ మూవీ వదులుకున్న హీరోయిన్.. ఎవరంటే?

సాధారణంగా స్టార్ హీరో సినిమా అనగానే కొంత మంది నటీనటులు ఓకే చెప్పేస్తుంటారు. కొద్ది మంది మాత్రం తమ పాత్ర, మూవీ స్టోరి గురించి అడుగుతుంటారు. అయితే, ఇండస్ట్రీలో సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ చిత్రం అంటే చాలు.. ఫుల్ క్రేజ్ ఉంటుంది. అది ఎప్పటికీ కొనసాగుతుందని సినీ పరిశీలకులు చెప్తుంటారు. బాలయ్య నటించిన ‘సమర సింహారెడ్డి’ పిక్చర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి అందరికీ విదితమే. ఈ మూవీలో ఒక సీన్ తనకు నచ్చలేదని మూవీ రిజెక్ట్ చేసింది ఓ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసుకుందాం.

యాక్షన్ డైరెక్టర్ బి.గోపాల్-నందమూరి యువరత్న బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా అనగానే ఎంతో క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ సూపర్ హిట్ సినిమాలు అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ‘సమరసింహారెడ్డి’ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఫ్యామిలీ మూవీస్ హవా ఆ టైమ్ లో కొనసాగుతున్నప్పటికీ బి.గోపాల్..యాక్షన్ ప్లస్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ‘సమర సింహారెడ్డి’ పిక్చర్ తీసి అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఈ చిత్రానికి తొలుత ‘సమర సింహం’ అనే టైటిల్ అనుకున్నారు. కానీ, పరుచూరి గోపాల కృష్ణ..‘సమర సింహారెడ్డి’ అని పెడితే బాగుంటుందని సూచించారు. దాంతో అలానే టైటిల్ పెట్టారు.

ఇక ఇందులో హీరోయిన్స్ గా సిమ్రాన్, అంజలి ఝవేరి నటించారు. కాగా, తొలుత ఈ సినిమాలో హీరోయిన్ గా రాశిని అనుకున్నారట. రాశి ఈ చిత్ర కథ విన్న తర్వాత సినిమాలో వచ్చే సీతాకొకచిలుక సీన్ తనకు నచ్చలేదని చెప్పిందట. అలా రాశి ఆ ఒక్క సీన్ కు నో చెప్పి..సినిమా రిజెక్ట్ చేయగా, అది ఆ తర్వాత సిమ్రాన్ వద్దకు వెళ్లింది. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ..వసూళ్ల వర్షం కురిపించడమే కాదు..ఇండస్ట్రీ మొత్తం కొన్నేళ్ల పాటు గుర్తించుకునే చిత్రంగా నిలిచింది.