అలనాటి అందాల తార హోమ్లీ బ్యూటీ సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి చిన్న వయసులోనే వెండితెర నుంచి కనుమరుగైన సౌందర్యను అభిమానులు ఎవరు అంత త్వరగా మరిచిపోలేరని చెప్పాలి. గ్లామర్ ప్రపంచంలో కూడా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి స్టార్ హీరోయిన్గా ఎదిగి ఎంతోమంది కొత్త హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచిన ఈమె అంటే ఇప్పటికీ చాలామందికి గౌరవమే అని చెప్పాలి. 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సౌందర్య అప్పటివరకు టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
ఇక తన తోటి నటీమణులు రమ్యకృష్ణ , నగ్మా, రోజా, రంభ , ఆమని లాంటి వారు గ్లామర్ ఫీల్డ్ లో దూసుకుపోతుంటే సౌందర్య మాత్రం పద్ధతిగా సినిమాలను చేస్తూ హద్దులు దాటకుండా స్టార్ హీరోయిన్గా నిలబడింది. ఇక దీన్ని బట్టి చూస్తే ఆమె నటన విభాగంలో ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా సౌందర్య గురించి సీనియర్ నటి వెన్నెరాడై నిర్మల ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. వెంకటేష్ , సౌందర్య నటించిన జయం మనదేరా సినిమా షూటింగ్ కొంత భాగం స్విజర్లాండ్ లో జరిగింది. అందులో నేను కూడా కీలకపాత్ర పోషించాను.
ఆ సినిమా షూటింగ్ సమయంలోనే నేను సౌందర్య కి బాగా క్లోజ్ అయ్యాను. అయితే ఆ చిత్ర షూటింగ్ సమయంలో ఆమె ఎవరినో ప్రేమిస్తున్నట్లు నాకు అర్థం అయింది అంటూ నిర్మల వెల్లడించింది. అయితే సౌందర్య ఎవరిని ప్రేమించింది అన్న విషయం మాత్రం నిర్మల బయట పెట్టలేదు. ఇకపోతే నటిగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో కలలు కన్నా సౌందర్య ప్రేమించిన వ్యక్తిని చేసుకోకుండానే రఘు అనే వ్యక్తిని 2003లో వివాహం చేసుకుంది. అయితే ఎప్పుడు కూడా ఎలాంటి రూమర్స్ కి చోటు ఇవ్వని సౌందర్య ఆ సమయంలో ఒక హీరోతో ఎఫైర్ ఉందని వార్తలు వినిపించాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని వెన్నెల కొట్టి పారేసింది.