మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా-నరసింహారెడ్డి` తెలుగు- హిందీ- తమిళ- మలయాళ- కన్నడ- హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజవుతోంది. బుధవారం రిలీజ్ అవుతోన్న ఈ సినిమా మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ల రూపంలో థియేటర్లలోకి రానుంది. ఐదు భాషల్లో భారీ ఎత్తున వస్తోన్న ఈ సినిమా ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుంది ? అన్న దానికి ఆన్సర్ వచ్చేసింది. పాన్ ఇండియా మూవీ సైరా రిలీజ్ ను కొణిదెల కంపెనీ భారీ స్థాయిలోనే ప్లాన్ చేసింది.
వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే సైరా 4620 థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో చూస్తే నైజాం 420.. సీడెడ్ 330.. ఆంధ్ర 450 మేర థియేటర్లను కేటాయించారు. ఓవరాల్ గా ఏపీ తెలంగాణలో 1200 థియేటర్లలో రిలీజవుతోంది. ఈ మూడు ప్రాంతాల్లో కూడా చిరుకు బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న ఆంధ్రాలోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఇతర రాష్ట్రాలు చూస్తే కర్ణాటక 340.. తమిళనాడు 350.. కేరళ 130.. థియేటర్లలో రిలీజువతోంది. ఉత్తరాది సహా ఓవర్సీస్ కలుపుకుంటే దాదాపు 3600 థియేటర్లలో రిలీజవుతోంది. ఇక మెట్రో నగరాలు అయిన హైదరాబాద్, చెన్నై, ముంబైతో పాటు అమెరికా లాంటి చోట్ల స్పెషల్ షోలకు మంచి డిమాండ్ ఉంది. ఒక్క చెన్నైలోనే ఉదయం 8 గంటలకు ఏకంగా 50 తెలుగు వెర్షన్ స్పెషల్ షోలు ప్లాన్ చేశారు.
ఓవరాల్ గా చూస్తే బాహుబలి- సాహో చిత్రాల్ని దాదాపు 9000 పైగా థియేటర్లలో రిలీజ్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సైరా మాత్రం 5వేల లోపు థియేటర్లలోనే రిలీజవుతోందన్నది ట్రేడ్ రిపోర్ట్. మరి చిరు ఎలా గర్జిస్తాడో ? చూడాలి.