ఆ దర్శకుడి సినిమాపై నాగార్జునకు భారీ అంచనాలు.. సీన్ కట్ చేస్తే..

-

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అలా కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం వల్లే తన కెరీర్ నిలబడిందని నాగార్జున చెప్తుంటారు. తన సినీ కెరీర్ లో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన నటించిన చిత్రాలు ‘బ్రహ్మాస్త్రం’, ‘ది ఘోస్ట్’ త్వరలో విడుదల కానున్నాయి.

- Advertisement -

ఈ సంగతులు అలా పక్కనబెడితే..నాగార్జున బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ తో చేసిన సినిమాపైన భారీ అంచనాలను పెట్టుకోగా, రిజల్ట్ అనుకున్న స్థాయిలో రాలేదు. ఆ సినిమా సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ చేసిన ఏకైక తెలుగు సినిమా ‘క్రిమినల్’. నాగార్జున హీరోగా వచ్చిన ఈ ఫిల్మ్ పైన అప్పట్లో భారీ అంచనాలు ఉన్నాయి.

నాగార్జున సైతం ‘క్రిమినల్’ మూవీ డెఫినెట్ గా సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు. ఎం.ఎం.కీరవాణి అందించిన మ్యూజిక్ సూపర్ హిట్ అయింది. ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఇప్పటికీ ఆ పాటలను ప్రజలు వింటుంటారు. కాగా, సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ పిక్చర్ లో హీరోయిన్స్ గా మనీషా కోయిరాల, రమ్యకృష్ణ నటించారు.

ఈ చిత్రంలోని ‘తెలుసా..మనసా’ సాంగ్ ఇప్పటికీ ప్రతీ ఒక్కరి ఫేవరెట్ సాంగ్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ పిక్చర్ డెఫినెట్ గా రికార్డు వసూళ్లు క్రియేట్ చేయడంతో పాటు నాగార్జున కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందని దర్శకుడు మహేశ్ భట్ అనుకున్నారట. కానీ, సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయితే, మేకింగ్ పరంగా సినిమా ప్రాసెస్ ను నాగార్జున చాలా బాగా ఎంజాయ్ చేశారట. నాగార్జున ‘బ్రహ్మాస్త్రం’ సినిమాతో చాలా కాలం తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇటీవల ఆయన తనయుడు నాగచైతన్య..ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కాగా, ఆ ఫిల్మ్ అనుకున్న స్థాయిలో ఆడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...