Ileana: ఆ కారాణాల వలన ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..ఇలియానా షాకింగ్ కామెంట్స్

-

తన నడుము అందాలతో కుర్రకారుకు మత్తెక్కించే సుందరి ఎవరు అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు బ్యూటిఫుల్ హీరోయిన్ ఇలియానా అని చెప్పొచ్చు. ఈ భామ ప్రతీ సినిమాలో తన నడుము అందాలను చూపించి ప్రేక్షకులకు ట్రీట్ ఇస్తుంటుంది. ఎనర్జిటిక్ హీరో ‘దేవదాస్’ ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ గోవా సుందరి.. ఆ తర్వాత తన మకాం బీ టౌన్ కు మార్చుకుంది. ప్రజెంట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అమ్మడు అప్పుడప్పుడు తెలుగు సినిమాలూ చేస్తోంది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇల్లూ బేబీ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని, అందుకు గల కారణాలనూ తెలిపింది ‘పోకిరి’ చిత్ర కథానాయిక.

తనపై చాలా సార్లు బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చాయని, అయితే వాటిని తాను అస్సలు పట్టించుకోలేదని అంది ఇలియానా. తనకు 12 ఏళ్ల వయసు నుంచే బాడీలో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, అందుకే అప్పట్లో తాను సూసైడ్ చేసుకుందామనుకున్నానని పేర్కొంది. అయితే, ఆ తర్వాత కాలంలో తాను అనవసర విషయాలు పట్టించుకోకుండా, అవసరమైన వాటిపైనే ఫోకస్ చేయాలన్న సంగతి తెలుసుకున్నానని అంది ఇలియానా.

 

కొందరు తనపై తప్పుడు ప్రచారం చేశారని, తాను శరీర ఆకృతి వల్లే సూసైడ్ చేసుకుందామనుకున్నానని రాశారని చెప్పింది. అది తప్పని అన్న ఇలియానా..ఆ వార్తలు, ఆర్టికల్ చదివి తనకు చిరాకు వచ్చిందని స్పష్టం చేసింది. ఇల్లూ బేబీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు చివరగా ఈ భామ మాస్ మహారాజా రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఫిల్మ్ లో కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news