మెగా హీరో కోడలి ఆస్తి పైన బ్రతుకుతున్నారా.. శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!!

-

శ్రీరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడు ఎవరిమీద ఎలాంటి కామెంట్లు చేస్తుందో చెప్పడం చాలా కష్టం.. అయితే ఈమె ఎక్కువగా మొదటి నుంచి మెగా ఫ్యామిలీ మీదనే తన రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఎవరో చెప్పినట్టే వారిపై పగబట్టినట్టే.. విమర్శిస్తూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ. కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి అంతకుముందు కొన్ని సినిమాలలో చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఈ ఉద్యమంతోనే ఆమె బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత నిత్యం కాంట్రవర్సీ ఇంటర్వ్యూ లతో విరుచుకుపడుతోంది. అంతేకాదు మీడియా ముందే ఇతరులపై బూతులు మాట్లాడేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇక తాజాగా ఈమె మరొకసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది. శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. చిరంజీవి మొదటి నుంచి తమ్ముడికి సపోర్టు లేదు అంటూనే ఇన్ డైరెక్ట్ గా రాజకీయంగా సపోర్ట్ చేస్తున్నాడు అంటూ విమర్శించింది. అంతేకాదు ఆయన మొదటి నుంచి గోడ మీద పిల్లి లాగే బ్రతుకుతున్నాడు అంటూ వివాదాస్పద కామెంట్లు కూడా చేసింది. అంతటితో ఆగకుండా మెగా కోడలు ఉపాసన ను కూడా ఇందులోకి లాగింది. అసలు ఉపాసన లేకపోతే చిరంజీవి ఏమైపోతాడో అంటూ కూడా వాపోయింది. ఉపాసన ఆస్తులతోనే నువ్వు బతుకుతున్నావని మర్చిపోకు.. నువ్వు ఎప్పుడు ఎవరో ఒకరు మీద పడి బతకడమే నీ పని అంటూ చిరంజీవిని దారుణంగా తిట్టిపోస్తోంది.

ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈమె ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోవడంతో కోలీవుడ్లో అడపాదడపా సినిమాలు చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా గుమగుమలాడే వంటలు చేస్తూ అందర్నీ అలరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news