రామ్ చరణ్ లో ఇంత లవ్ యాంగిల్ ఉందా.. టూ రొమాంటిక్ గురూ..!

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన తదుపరిచిత్రం ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచన తప్ప రామ్ చరణ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనే ఆ కామెంట్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు లభించిన తర్వాత ఆయన తన భార్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటి వరకు దుబాయ్ లో ఎంజాయ్ చేసిన ఈ జంట ఆ తర్వాత మాల్ దీవ్స్ కి వెళ్లారు. ఇక అక్కడ కూడా ప్రైవసీని మెయింటైన్ చేసిన వీరు ఇటీవల హైదరాబాద్ కి తిరిగి వచ్చారు.

ఇక పెళ్లయిన పదేళ్ల తర్వాత మెగా ఇంటికి వారసులు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరుపొందిన ఈ జంట గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ఇక మెగా అభిమానులు కూడా వీరికి పుట్టబోయే బిడ్డ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దుబాయ్ లోని నమ్మొచ్ బీచ్ క్లబ్లో ఉపాసన బేబీ షవర్ ను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ప్రెగ్నెన్సీ సమయంలో తాను తీసుకుంటున్నటువంటి డైట్ గురించి పలు విషయాలను తెలియజేసినామే అలాగే తన భర్త తనకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ గురించి కూడా వెల్లడించింది. రామ్ చరణ్ వాలెంటైన్స్ డే సందర్భంగా తనకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు అని తెలిపింది. లవ్ సింబల్ తో ఉన్న ఇయర్ రింగ్స్ ను ఆమెకు కానుకగా ఇచ్చారట.. ఇప్పుడు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే కడుపులో బిడ్డతో ఇలా విదేశాలకు పర్యటించడం చాలా సంతోషంగా ఉందని ఉపాసన వెల్లడించారు. ఇకపోతే ఈ విషయం తెలిసి రామ్ చరణ్ రొమాంటిక్ గురూ..! అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version