తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర కుటుంబాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి ఫ్యామిలీ గురించి పరిచయం ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు. నందమూరి తారకరామారావు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత రాజకీయాలలో కూడా తన సత్తా చాటి ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించి పెట్టారు. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. ప్రస్తుతం స్టార్ పొజిషన్ ను అనుభవిస్తున్న వారు మాత్రం ఇద్దరే ఇద్దరు . అందులో ఒకరు బాలకృష్ణ.. మరొకరు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆ పేరు పెట్టడం వెనుక దాగి ఉన్న రహస్యం ఒకసారి తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండవ భార్య కుమారుడు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒకరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ తో తన మనవడిని చూడాలని కబురు పెట్టారట. హరికృష్ణ ఫోన్ చేసి తాత గారిని వెంటనే కలవాలని చెప్పడంతో .. 108 డిగ్రీల జ్వరం తో ఎన్టీఆర్ వున్నప్పటికీ తాత గారు పిలిచేసరికి తన తల్లి శాలిని ఎన్టీఆర్ ను రెడీ చేసి తాత దగ్గరకు పంపించారట. ఇక అప్పటివరకు తాత అంటే ఎవరో తెలియని ఎన్టీఆర్..తన తాత ని చూసి ఒక్కసారిగా భయపడిపోయి.. దూరంగా నిలబడి పోవడంతో సీనియర్ ఎన్టీఆర్ దగ్గరకు తీసుకొని నీ పేరు ఏమిటి అని అడిగారట. ఇక అప్పుడు తన పేరు తారక్ అని చెప్పగా.. ఆ పేరు నచ్చని సీనియర్ ఎన్టీఆర్ ఇప్పటినుంచి నీ పేరు నందమూరి తారక రామారావు అని జూనియర్ ఎన్టీఆర్ కు నామకరణం చేయడం జరిగింది.