Jailor Vs Bholashankar: మొదటిరోజు కలెక్షన్ల తేడా ఎంతో తెలుసా..?

-

Jailor Vs Bholashankar.. కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు అంతకుమించి కలెక్షన్లు కూడా వసూలు చేస్తూ దూసుకుపోతోంది. సౌత్ సినీ భాషలలో ఆగస్టు 10వ తేదీన చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా మొదటి రోజే ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.72 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంతేకాదు తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్ మూవీగా నిలిచి రికార్డు బ్రేక్ చేసిందని చెప్పవచ్చు.

మరొకవైపు ఒక రోజు తేడాతో మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల చేశారు. అయితే ఈ సినిమా తమిళంలో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఆల్రెడీ అటు థియేటర్లలో ఇటు ఓటీటీ లలో ఈ సినిమాను ప్రేక్షకులు చూసేసారు. ఇక దీనిని ఎవరు చూస్తారు అని అభిమానులు అనుకుంటూ ఉండగా ఇందులో 70% కథను మార్చాము అని అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని మెహర్ రమేష్ వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ ప్రేక్షకులు అనుకున్నట్టుగానే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది .మొదటిరోజు కేవలం రూ.22 కోట్లు మాత్రమే కలెక్షన్స్ వసూలు చేసి అట్టర్ ప్లాఫ్ గా నిలిచిందని చెప్పవచ్చు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ అని చెప్పడంలో సందేహం లేదు.

అయితే ఇద్దరు స్టార్ హీరోలు ఒకరోజు తేడాతో థియేటర్ వద్ద పోటీ పడినప్పటికీ కూడా కనీసం సగం కూడా చిరంజీవి సినిమా రాబట్టలేకపోయింది. దీనికి కారణం రీమేక్ సినిమాలనే చెప్పవచ్చు. ఆల్రెడీ చూసేసిన సినిమాలో కొన్ని మార్పులు చేసి మళ్ళీ తెరపైకి తీసుకొస్తే ప్రేక్షకులు చూడడానికి ఆసక్తి చూపించరు అని మరొకసారి నిరూపించారు. ఇక అలా డైరెక్ట్గా వచ్చిన రజినీకాంత్ సినిమాకే ప్రేక్షకులు ఎక్కువగా ఓటు వేశారని.. ఇక చిరంజీవి సినిమా అందుకే డిజాస్టర్ గా మిగిలిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version