ప్రముఖ సినీ నటి జీవిత రాజశేఖర్ గురువారం చిత్తూరు జిల్లా నగరి కోర్టుకు హాజరయ్యారు. ఈ కోర్టు నుండి గతంలో తనపై అరెస్టు వారేంటి జారీ చేసిన సందర్భంలో హైకోర్టులో రీకాల్ పిటిషన్ వేశారు. తమకు రూ. 26 కోట్లు బకాయి పడ్డారంటూ జీవిత పై ఇటీవల జోస్టర్ గ్రూప్ యాజమాన్యం ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ వద్ద అప్పు తీసుకున్న జీవిత రుణాన్ని తిరిగి చెల్లించలేదని ఆరోపించింది. అంతేకాకుండా జీవిత ఇచ్చిన చెక్ బ్యాంకులో డిపాజిట్ చేయగా.. అది బౌన్స్ అయిందని పేర్కొంది.
ఈ వ్యవహారంపై గ్రూపు యాజమాన్యం నగరి కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆమె న్యాయవాది మురుగంతో కలిసి కోర్టుకు వచ్చారు. అయితే ఈ కేసును సెప్టెంబర్ 19 కి వాయిదా వేశారని ఆమె తరపు న్యాయవాది మురుగన్ తెలిపారు. జీవితకు గరుడవేగ చిత్ర నిర్మాణం కోసం నగరి నియోజకవర్గంలోని విజయపురం మండలం మహారాజపురం లోని సాయిశక్తి ఇంజనీరింగ్ కళాశాల నిర్వాహకుడు కోటీశ్వర రాజు భార్య హేమరాజు రూ. 26 కోట్లు ఇచ్చినట్లు.. అందుకు సంబంధించిన ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినట్లు, హేమరాజు తమిళనాడు తిరువల్లూరు కోర్టులో, నగరి కోర్టులో రెండు కేసులు వేశారు. ఈ నేపథ్యంలోనె ఆమె కోర్టుకు హాజరయ్యారు.