వారికోసమే సినిమాలకు దూరం అంటున్న కాజల్..!!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తన అందం నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. తనదైన శైలిలో నటిస్తూ ఎంతోమంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది కాజల్ అగర్వాల్. ఎంతో మంది అగ్ర హీరోల సరసన నటించి అన్ని సినిమాలలో కూడా సూపర్హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే 2020 అక్టోబర్ 30వ తేదీన తన చిన్ననాటి స్నేహితుడు అలాగే ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్, వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ కిచ్లు ను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.Kajal Aggarwal Looks Prettiest In a Lime Green Anarkali As She Celebrates Her First Teej | See Picsపెళ్లయిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా కొద్దిరోజులపాటు సినిమాలలో మంచి దూకుడుతో నటించింది. ఇక పెళ్ళి తర్వాత కూడా భర్త సహకారంతో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న కాజల్ అగర్వాల్ గర్భందాల్చి కొంతవరకు సినిమాలకు, షూటింగ్లకు గ్యాప్ ఇచ్చింది.. ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. తన కొడుకుకు నీల్ కిచ్లు అని నామకరణం కూడా చేసి ఆ పేరును అధికారికంగా ప్రకటించారు ఈ దంపతులు. కొడుకు జన్మించి నెల కూడా కానందున ఆమె ప్రస్తుతం కొద్దిరోజులపాటు సినిమాలకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది . బిడ్డ యొక్క ఆలనా పాలనా చూసుకుంటూ ఇంటికే పరిమితం కావాలని నిర్ణయం తీసుకుంది..Is Kajal Aggarwal's baby bump visible in latest posts? Check it out - Movies Newsఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ కుటుంబ బాధ్యతలు అలాగే బిడ్డ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం . అంటే ఇకపై కాజల్ అగర్వాల్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రముఖ దర్శక నిర్మాతలు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కాజల్ అగర్వాల్ అభిమానులు కొంత నిరాశ చెందుతున్నప్పటికీ ఇంకా కాజల్ అగర్వాల్ ఈ విషయం పై స్పష్టత ఇవ్వలేదు కాబట్టి ఆమె ఇచ్చే క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news