ఫ్యూచర్‌ గురించి భయపడుతున్న కాజల్‌

-

ఎక్కువకాలం వెయిట్‌ చేయకుండా.. స్టార్‌డమ్‌ వచ్చింది. ప్రేమించిన అబ్బాయినే ట్విస్టులు లేకుండా పెళ్లి చేసుకుంది. హనీమూన్‌ ట్రిప్‌కు వెళ్లొచ్చి ఎన్నో అనుభూతులు మిగుల్చుకుంది. తను అనుకున్నట్టే జీవితం సాగిపోతోంది. అయితే.. ఒక్క విషయంలో తప్ప. ఎందుకోగానీ.. చందమాకు దిగులు పట్టుకుంది. పెళ్లినాటికి కాజల్‌ తెలుగు, తమిళం… హిందీ సినిమాల్లో బిజీగా వుంది. పెళ్లి తర్వాత ఈ అమ్మడి మనసు దేని గురించి ఆలోచిస్తోంది.

కాజల్‌కు పెద్దగా ఆఫర్స్‌ లేకపోయినా… ఆచార్యలో మెగాస్టార్‌తో జత కడుతోంది. ఇంతకంటే పెద్ద ఆఫర్‌ ఏముంటుంది? తమిళంలో ‘భారతీయుడు2’లో కమల్‌తో నటిస్తోంది. పెళ్లి తర్వాత తట్టాబుట్టా సద్దుకుని వెళ్లనని.. కెరీర్‌ సాగిస్తానని చెప్పేసింది. అయితే.. పెళ్లియిన ఈ ఆంటీకి ఆఫర్స్‌ వస్తాయా? లేదా? అన్నది పెద్ద డౌటే. కాజల్‌కు సమంత భయం పట్టుకుంది. సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వైపు స్టార్‌ హీరోలు చూడలేదు. లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో … వెబ్‌ సిరీస్‌తో సరిపెట్టుకుంటూ.. రీసెంట్‌గా యాంకరింగ్‌ వైపు యు టర్న్‌ తీసుకుంది. సమంత తెలుగులో మాట్లాడేస్తుంది కాబట్టి హోస్ట్‌గా ఆమెను ఆదరించారు. కాజల్‌కు తు అంటే త రాదు. దీంతో తెలుగులో ఫూచర్‌ ఏమిటన్న భయం పట్టుకుంది.

ఎంతటి స్టార్‌ హీరోయిన్‌ అయినా.. పెళ్లయితే పట్టించుకోరు. హిందీ ఆడియన్స్‌ మాదిరి పెద్ద మనసు చేసుకుని.. తెలుగు ప్రేక్షకులు చూస్తారా? అన్నది డౌటే. పెళ్లి తర్వాత కూడా నటిస్తానన్న కాజల్‌ను తెలుగు హీరోలు లెక్కచేస్తారా? సమంత మాదిరి వేరే దారులు వెతుక్కోవాలా? లేదంటే.. భర్తతో కలిసి మాల్దీవ్సో.. గోవానే వెళ్తూ.. టైం పాస్‌ చేయాలా? చందమామ అదృష్టం ఎలా వుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news