డిఫరెంట్ లుక్ లో కాజోల్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

-

ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్లో నటిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో కాజోల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె అందానికి నెటిజన్స్ సైతం మంత్రముగ్ధులు అవుతూ ఉంటారు. అయితే తాజాగా కాజల్ వేసుకున్న ఒక డ్రెస్ పై విపరీతంగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి.

నటి కాజల్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బయట ఎక్కడ కనిపించినా ఎంతో అందంగా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ వస్తుంటారు కాజోల్. తాజాగా కాజోల్ ముంబయిలో తన భర్త నటించిన చిత్రం ‘భోలా’ ప్రీమియర్ షోకు హాజరైంది. ఈ ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన కాజోల్ తెల్లటి కోటుతో పాటు గ్రీన్ కలర్ డ్రెస్ లో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించింది. ఆమె వెంట కొడుకు యుగ్, తల్లి తనూజ, భర్త అజయ్ దేవగన్ కూడా ఉన్నారు. అయితే ఈ డ్రెస్ లో కాజోల్ ను చూసిన నెటిజన్స్ అంతా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

కొందరైతే కాజోల్ మరింత అందంగా కనిపిస్తోందంటూ కామెంట్ చేయగా.. చాలామంది ఆమె లుక్, నడకపై ట్రోల్స్ చేశారు. ఆమె దుస్తులతో పాటు నడక మరింత విచిత్రంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఆమె గర్భవతిలో కనిపిస్తుంది అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. కాగా ప్రస్తుతం కాజోల్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి. గతంలో సైతం ఆమె చర్మానికి సంబంధించి సర్జరీ చేయించుకున్నారని ప్రస్తుతం ముఖానికి సర్జరీ చేయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆమె ఫ్యాన్స్ మాత్రం కాజోల్ ఎలా ఉన్నా చాలా అందంగా ఉంటారు అంటూ పొగిడేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news