షర్మిల మా ఆఫీసుకు వచ్చి మాపైనే విమర్శలు చేయడం తగదు – తమ్మినేని

-

సీఎం కేసీఆర్ నియంత్రిత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అన్ని పార్టీలను ఏకతాయిటిపైకి తీసుకువస్తున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలోనే నేడు సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి వారితో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల.. కమ్యూనిస్టులు మునుగోడు ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి బీటీంగా పనిచేశారని ఆరోపించారు. షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయ వైఖరులు ఉంటాయని.. మేము మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బహిరంగంగానే మద్దతు తెలిపామన్నారు. సీపీఎం పార్టీ తెరచాటు రాజకీయాలు చేయదన్నారు తమ్మినేని. షర్మిల మా ఆఫీసుకు వచ్చి మాపైనే విమర్శలు చేయడం తగదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల కోసం అందరం మాట్లాడాలన్నారు. బీజేపీ వుంటే మేము భాగస్వామ్యం కాలేమని షర్మిలకి చెప్పామన్నారు. వైఎస్ షర్మిల మా దృష్టికి తీసుకువచ్చిన అంశాలను పార్టీలో చర్చించి నిర్ణయం తెలుపుతామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news