మంచు కొండల్లో ఒంటరిగా నిఖిల్..‘కార్తీకేయ-2’ అప్‌డేట్..

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్..తను నటించిన ‘కార్తీకేయ-2’ ఫిల్మ్ ను వినూత్నంగా ప్రమోట్ చేస్తు్న్నాడు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో వరుస అప్ డేట్స్ వెరైటీగా ఇచ్చే్స్తున్నాడు. తాజాగా ట్వి్ట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో అప్ డేట్ ఇచ్చేశాడు.

జూన్ 24(శుక్రవారం) సాయత్రం05.40 గంటలకు ఏఎంబీ సినిమాస్ స్క్రీన్ 3లో ‘కార్తీకేయ-2’ ట్రైలర్-1ను విడుదల చేస్తు్న్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా తెలిపారు.

సదరు పోస్టర్ లో మంచు కొండల్లో ఒంటరిగా నిఖిల్ కూర్చొని ఉన్నాడు. అలా కూర్చొని ఉన్న నిఖిల్..తన చేతిలో ఉన్న వస్తువును అలా తథేకంగా చూస్తూ పరిశీలిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించగా, ఈ ఫిల్మ్ పైన ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. నిఖిల్ కు జోడీగా ఇందులో హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news