అఫీషియల్: అమెజాన్ ప్రైమ్‌లో ఉచితంగా KGF2..స్ట్రీమింగ్ టైమ్ ఫిక్స్

-

శాండల్ వుడ్ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ మాస్ యాక్షన్ థ్రిల్లర్. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమాను ప్రస్తుతం ప్రైమ్ వినియోగదారులు సైతం రూ.199 చెల్లించి చూస్తున్నారు. కాగా, జూన్ 3 నుంచి ప్రైమ్ వినియోగదారులు ఫ్రీగా ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు చూడొచ్చు.

ఈ సినిమాను ఆ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వారు అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ.1,200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రంలో రావు రమేశ్, ప్రకాశ్ రాజ్, రవీనా టండన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు.

KGFచాప్టర్1కు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 అంతకు మించిన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ పిక్చర్ చేస్తు్న్నారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news