ఖాళీ కడుపుతో జ్యూస్‌ తాగుతున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోండి..

-

డైట్ లో భాగంగా బరువు తగ్గడానికి చాలామంది మార్నిగ్ బ్రేక్ ఫాస్ట్ మానేసి జ్యూసులు తాగుతున్నారు. వీటివల్ల బరువు తగ్గటమే కాకుండా..స్కిన్ కూడా హెల్తీగా ఉంటుందని అనుకుంటాం..కానీ వాటి వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి మీకు తెలుసా? శరీరానికి అవసరమైన పోషకాలు పండ్లలో ఉన్నందున తాజా పండ్ల రసం తాగడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం శరీరానికి హానికరం. ఈరోజు ఖాళీ కడుపుతో ఏ పండ్ల రసాలను తాగకూడదోచూద్దాం.

సిట్రస్ పండ్ల రసం..

నివేదికల ప్రకారం, సిట్రస్ పండ్ల రసం తాగడం మీ శరీరానికి హాని కలిగిస్తుంది. ఉదాహరణకు, ఖాళీ కడుపుతో నారింజ, సీజనల్, ద్రాక్షపండు లేదా నిమ్మరసం తాగడం వల్ల సమస్యలు వస్తాయి. ఎందుకంటే, ఈ పండ్లలో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. ఈ పులుపుగా ఉండే పండ్ల రసం కారణంగా మీకు అసిడిటీ సమస్య రావొచ్చు. అయితే ఇది అందరికీ హానికరం కాకపోవచ్చు.

చల్లని జ్యూస్..

ఉదయం ఖాళీ కడుపుతో చల్లని జ్యూస్ కూడా తాగకూడదు..ఎందుకంటే ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఉదయాన్నే చల్లటి రసం తాగడం వల్ల మీ శ్లేష్మ పొరలు దెబ్బతింటాయి. దీని వల్ల జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఉదయాన్నే జ్యూస్ తాగే అలవాటును మార్చుకోండి. ఆహారం తిన్న తర్వాత తాగండి మంచిది.

అయితే కొందరు బ్రేక్ ఫాస్ట్ మానేసిన వారి పరిస్థితి ఏంటి..ఉదయం స్ప్రౌట్స్, నానపెట్టిన నట్స్ తిన్నా తర్వాత ఒక అరగంటకు జ్యూస్ తాగటం అలవాటుగా చేసుకోండి..అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మనమే ఆరోగ్యాన్ని దెబ్బతినేలా చేసుకుంటే ఎలా..అయితే ఈ విధంగా తాగే అందరికి ఉంటుంది అని స్పష్టంగా చెప్పడం లేదు. కానీ ఎవరికైతే..ఉదయం జ్యూస్ తాగేవారికి యాసిడిటీ సమస్య పదే పదే తలెత్తుతుందే…వారు మాత్రం ఒక క్షణం ఆలోచించాల్సిందే మరీ.!

Read more RELATED
Recommended to you

Latest news