OTTలో KGF2..రైట్స్ కోసం అన్ని కోట్ల?

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF2 పిక్చర్ గత నెల 14న విడుదలై రికార్డుల వేట కొనసాగిస్తోంది. బాక్సాఫీసు కా బాప్ అయిపోయాడు రాఖీ భాయ్ అలియాస్ రాకింగ్ స్టార్ యశ్. చాప్టర్ 1కు కొనసాగింపుగా వచ్చిన ఈ కేజీఎఫ్ చాప్టర్ 2..చాప్టర్ 1ను మించి సక్సెస్ అయింది.

బాలీవుడ్ రికార్డులన్నిటినీ తిరగరాసిన KGF2 సరికొత్త రికార్డుల వేటలో తలమునకలైంది. బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ ‘‘దంగల్’’ రికార్డు కలెక్షన్స్ ను క్రాస్ చేసింది KGF2. శుక్రవారం ఈ చిత్రం రూ.400 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ.1,000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇకపోతే ఈ సినిమా ఎఫ్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరలవుతోంది.

ఈ నెల 27న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారంలోకి ఈ పిక్చర్ వచ్చేస్తుందని అంటున్నారు. ఇందుకుగాను ఓటీటీ యాజమాన్యం దాదాపు రూ.320 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. KGF చాప్టర్1 అమెజాన్ ప్రైమ్ వీడియో OTTలో స్ట్రీమ్ అవుతోంది. KGF2 ఓటీటీ రైట్స్ నూ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేయబోతుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news