కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యండిల్ ను బ్లాక్ చేసిన కేటీఆర్ !

-

ఈవాళ రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్… రాహుల్ గాంధీ పర్యటన పై సెటైర్లు వేశారు. ఆటో ఎమ్మెల్సీ కవిత కూడా రాహుల్ గాంధీ పర్యటన పై మండిపడ్డారు. అయితే వీరిద్దరికీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా… ధీటుగా సమాధానం ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ అధికార ట్విట్టర్ హ్యాండిల్ ను కేటీఆర్ బ్లాక్ చేశారు. దీంతో కాంగ్రెస్ పీటర్ అకౌంట్ లో ఘాటైన ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేతలు. ట్విట్టర్ పిట్ట తోకముడిచింది అని… ప్రశ్నలు చూసి కేటీఆర్ గజగజ వణికిపోతున్నారు అని ట్వీట్ చేశారు. ప్రజల తరఫున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలంగాణ కాంగ్రెస్ అధికార ట్విటర్ హ్యాండిల్ ను కేటీఆర్ బ్లాక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ బ్లాక్ చేయడం కేటీఆర్ మానసిక స్థితికి అద్దం పడుతుందని ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news