ప్రైమ్ వ్యుయర్స్‌కు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఫ్రీగా KGF2

-

శాండల్ వుడ్ సూపర్ హిట్ కాంబో ప్రశాంత్ నీల్ – యశ్…కేజీఎఫ్ చాప్టర్ 1కు కొనసాగింపుగా వచ్చిన చాప్టర్ 2 బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ఇఫ్పటికే రూ.1,200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇండియన్ సినిమా స్టామినా, స్టాండర్డ్స్ పెంచిన చిత్రంగా హిస్టరీలో ఈ సినిమా నిలిచిపోతుందని సినీ పరిశీలకులు చెప్తున్నారు.

ఇక ఈ చిత్రం థియేటర్స్ లో చూడని వారు OTTలో ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూశారు. కొంత కాలం కిందటే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చింది. కానీ, పే పర్ వ్యూ మోడల్ ప్రకారం.. అమెజాన్ ప్రైమ్ వ్యుయర్స్ డబ్బులు చెల్లించి చూడాలి. కాగా, శుక్రవారం నుంచి ఫ్రీగానే సినిమాను చూడొచ్చు.

ఎటువంటి డబ్బులు అనగా అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. శ్రీనిధిశెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ సంజయ్ దత్, రవీనా టండన్ కీలక పాత్రలు పోషించారు. అమెజా న్ ప్రైమ్ సబ్ స్క్రైబర్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆఫ్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news