డేటింగ్ ఏంటి.. నాకు ఆల్రెడీ పెళ్లైంది..!

-

భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కియరా అద్వాని తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటుంది. రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాలో నటించిన కియరా అద్వాని ఈ సంక్రాంతికి తన లక్ మరోసారి టెస్ట్ చేసుకోబోతుంది. ఇదిలాఉంటే తనకు ఎవరితోనో ముడి పెడుతూ వార్తలు రాయడంపై స్పందించింది కియరా అద్వాని. తాను ఎవరితో డేటింగ్ లో లేనని చెప్పిన కియరా తనకు ఆల్రెడీ పెళ్లైందని చెప్పి షాక్ ఇచ్చింది.

కియరాకు పెళ్లవడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు.. తాను సినిమాలనే ప్రేమిస్తున్నా అని.. పెళ్లికూడా చేసుకున్నా అని అంటుంది కియరా అద్వాని. చేస్తున్న సినిమాలతో తన పెళ్లి అయ్యిందని అంటుంది కియరా అద్వాని. ఇక లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ లో హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియెన్స్ మతులు పోగొట్టిన కియరా అది సరదాగా చేసిందని చెప్పింది.

ప్రస్తుతం పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సీరీస్ అది.. ఇక మీదట కూడా అలాంటి వెబ్ సీరీస్ లను చేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటుంది కియరా. అల్లు అర్జున్, త్రివిక్రం కాంబో సినిమాలో కియరా హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. హింది అర్జున్ రెడ్డిలో కూడా అమ్మడు ఛాన్స్ కొట్టేసింది. చూస్తుంటే తెలుగు, హింది భాషల్లో కియరా టైం నడుస్తుందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news