HanuMan: ప్రశాంత్ వర్మతో కృష్ణవంశీ ముచ్చట్లు..త్వరలో ‘హనుమాన్’ టీజర్

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘అ!’ అనే ఫీచర్ ఫిల్మ్ తీసి చక్కటి పేరు సంపాదించుకున్నారు. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ప్రశాంత్ వర్మకు ఈ పిక్చర్ తో ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ తర్వాత సినిమాల్లోనూ వైవిధ్యం కనబర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

తొలి సినిమా తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్ తో ‘కల్కి’ సినిమా చేసిన ప్రశాంత్ శర్మ.. ఆ తర్వాత ‘జాంబిరెడ్డి’ పిక్చర్ చేశారు. ఈ మూవీ సినీ లవర్స్ తో పాటు విమర్శకులకూ బాగా నచ్చింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తు్న్నారు.

ఓ వైపు ‘హనుమాన్’ చేస్తూ మరో వైపు ‘అధిర’..ఒకే సమయంలో రెండు సినిమాలు చేస్తున్నారు. ‘హనుమాన్’లో తేజ సజ్జ హీరోగా నటిస్తు్న్నారు. ‘అంజనాద్రి’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా, ఈ సినిమా సెట్స్ ను క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మంగళవారం సందర్శించారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఈ సందర్భంగా పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

కృష్ణవంశీ గతంలో ‘శ్రీ ఆంజనేయం’ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇందులో హనుమంతుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ నటించారు. ఈ క్రమంలోనే హనుమాన్ సినిమాలోని విషయాలను తెలుసుకునేందుకు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ వచ్చినట్లున్నారు. కాగా, కృష్ణవంశీ హనుమాన్ సెట్స్ లో ఉన్న ఫొటోను ప్రశాంత్ వర్మ ట్వి్ట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫొటో చూసి నెటిజన్లు ‘హనుమాన్’ టీజర్ ఎప్పుడున్నా? అని అడుగుతున్నారు. ముందు టీజర్ రిలీజ్ డేట్ చెప్పండి అన్న అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ రోజు మంగళవారం కాగా, ఈ రోజున కృష్ణవంశీ ‘హనుమాన్’ సెట్స్ ను విజిట్ చేయడం గొప్ప విషయమని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్ ‘అధిర’ చిత్రంతో..హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news