టీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు… వచ్చే ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తాం: బాల్క సుమన్

-

కాంగ్రెస్ పార్టీ బీజేపీ, టీఆర్ఎస్ ఒకటిని, బీజేపీ పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ అని ఒకటి అని విమర్శిస్తుంటారని.. కానీ టీఆర్ఎస్ పార్టీ ఎవరితోనూ కలవదు… 2014లో సింగిల్ గానే పోటీ చేశామని 64 సీట్లు సాధించామని… 2018లో 88 స్థానాల్లో గెలిచామని.. వచ్చే ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తామని…ఏ పార్టీతో అంటకాగే గత్యంతరం మాకు లేదని బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ప్రజలే బాసులు, మా హైకమాండ్ ఢిల్లీ, గుజరాత్ లో ఉండరని.. తెలంగాణ గల్లీల్లోనే ఉంటుందని సీఎం కేసీఆర్ అంటుంటారని బాల్క సుమన్ అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల ముందు దస్ పల్లా హోటల్లో బీజేపీతో మాట్లాడుకుని.. ఒప్పందం చేసుకుని బలహీనమైన అభ్యర్థిని ఎన్నికల్లో నిలబెట్టారని విమర్శించారు. బీజేపీకి పరోక్షంగా లబ్ధి చేకూర్చారని సుమన్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒకటని.. లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. ప్రజల ఎజెండానే టీఆర్ఎస్ ఎజెండా అని ఆయన అన్నారు. ప్రజలు ఆకాంక్షలు, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేలా ముందుకు వెళ్తాం అని అన్నారు. బుధవారం జరిగే ప్లీనరీలో కూడా ప్రజల ఆకాంక్షలకు సంబంధించి తీర్మాణాలు పెట్టుకుని ముందుకు వెళ్తాం అని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలతో కలిసి మెలిసి బతుకుతాం అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news