‘ఆదిపురుష్ టికెట్ల’పై ఆరోపణలను ఖండించిన చిత్ర బృందం

-

ఆదిపురుష్ సినిమా ప్రకటించినప్పటి నుంచి ట్రోల్స్, విమర్శలు షురూ అయ్యాయి. అన్నింటిని దాటుకుని వచ్చి.. ఎట్టకేలకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా తాజాగా టికెట్ల ధరల విషయంలో సామాజిక మాద్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలను తాజాగా చిత్ర బృందం ఖండించింది. రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటికి హనుమంతుడు వస్తాడనే నమ్మకంతో ఆదిపురుష్ ప్రదర్శించే థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీటు ఖాళీగా ఉంచాలని చిత్రబృందం నిర్ణయించారు.

అయితే ఆ సీటు పక్కనున్న సీట్ల టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసిన చిత్ర బృందం…. ఆంజనేయుడి సీటుతోపాటు పక్క సీట్ల టికెట్ ధరలో ఎలాంటి వ్యత్యాసం ఉండబోదని తెలిపింది. బయట జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రేక్షకులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. కాగా ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా పలువురు సినీ ప్రముఖులు నిరుపేద విద్యార్థులు, అనాథల కోసం వేలల్లో టికెట్లను కొనుగోలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version