కొత్త అవతారంలో సుధీర్ బాబు.. పోస్టర్ రిలీజ్

-

టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు గురించి స్పెషల్‌ గా చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్‌ లతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్‌ హీరో. అయితే తాజాగా సరికొత్త అవతారంలో కనిపించాడు సుధీర్ బాబు. “మామ మశ్చీంద్ర” అనే సినిమా కోసం సుదీర్ బాబు ఈ బబ్లి లుక్ లో కనిపించాడు.

బుగ్గలు, పోట్ట ఇలా తను ఇంతవరకు ఎప్పుడు కనిపించని రూపంలో దర్శనం ఇచ్చాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు మల్టీ షేడెడ్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగా దుర్గా అనే పాత్ర కోసం ఈ విధంగా తన రూపాన్ని మార్చుకున్నారు. సుధీర్ బాబు లావుగా ఉండటమే కాకుండా డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అంతా విలక్షణంగా ఉంది. జీపుపై కూర్చున్న ఈ హీరో నోట్లో బంగారు గొలుసుతో ఎవరినో తీక్షణంగా చూస్తున్నట్టు కనిపించారు. పొడవాటి జుట్టు, తేలికపాటి గడ్డంతో దర్శనం ఇచ్చాడు మామ…. అనే ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news