రాంచరణ్, మంచు లక్ష్మికి అరుదైన ఘనత… ఆ జాబితాలో చోటు

-

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు మంచులక్ష్మి. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  ప్రస్తుతం నటి, నిర్మాతగా ఇండస్ట్రీలో తనదైన శైలిలో కెరీర్‌లో ముందుకెళ్తూ సినీప్రియుల్ని ఆకట్టుకుంటున్నారు.

అయితే తాజాగా ఈమెకు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ టీసీ  కండ్లెర్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ లిస్ట్‌లో మంచు లక్ష్మి చోటు దకించుకున్నారు. ఈ లిస్ట్‌లో గ్లోబల్ లోని 100 మంది మోస్ట్ బ్యూటీఫుల్ ఫేసెస్‌ను నామినేట్ చేశారు. టీసీ టెండ్లర్ సంస్థ  ప్రతి ఏడాది వంద మందిని ఎంపిక చేస్తూ వస్తోంది. అలాంటి జాబితాలో మంచు లక్ష్మికి చోటుదక్కడం గొప్పవిషయమనే చెప్పాలి.

 మంచు లక్ష్మి
మంచు లక్ష్మి

ఈ సంస్థ 1990 నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నటీనటులకు, టీవీ పర్సనాలిటీలకు, స్టార్ ఆర్టిస్టులను గుర్తిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది లిస్ట్ లో మంచు లక్ష్మికి గౌరవం దక్కింది. ఈమెతో పాటు మహీరా ఖాన్, మెగా పవర్ స్టార్ రాంచరణ్, మానుషీ చిల్లర్ కూడా చోటు దక్కించుకున్నారు. దీంతో వారి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరి పోస్టులతో సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రామ్ చరణ్
రామ్ చరణ్

కాగా, మంచులక్ష్మి నటిగా తెలుగు తెరపై 2011లో మెరిసింది. హీరో సిధ్దార్థ – గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్ జంటగా నటించిన చిత్రం అనగనగా ఓ ధీరుడు చిత్రంలో మంచు లక్ష్మి నెగెటివ్ రోల్ లో నటించి మెప్పించింది. ఆ తర్వాత వరుస చిత్రాల్లో అవకాశాలను అందుకుంటూ వస్తోంది. లీడ్ యాక్ట్రెస్ గా కాకుండా తన ఇమేజ్ కు సరిపోయే పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

చివరిగా పిట్ట కథలు సినిమాలో ఓ కీలక పాత్ర ద్వారా మంచు లక్ష్మి ఆకట్టుకుంది.  కరోనా  పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు . ప్రస్తుతం లక్ష్మి అగ్ని నక్షత్రం అనే చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఈ చిత్రానికి  నిర్మాణ బాధ్యతలనూ చూసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

మంచు లక్ష్మి
మంచు లక్ష్మి

అలాగే మంచు ఫ్యామిలీలో ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉండేదంటే మంచు లక్ష్మి అనే చెప్పాలి. ప్రత్యేక రోజుల్లోనూ, తన ఫ్యామిలీలోని విశేషాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. కొన్ని స్పెషల్ డేస్ లో నెట్టింట తనదైన శైలిలో స్పందిస్తూ ఆకట్టుకుంటోంది.

లక్ష్మి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నమాన్ స్టార్ లోనూ కీలక పాత్రలో నటించింది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక రాంచరణ్ విషయానికొస్తే.. ఆయన ఇటీవలే ఆర్ఆర్ఆర్‌తో ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 మూవీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news