ప్ర‌భాస్ కోసం మైత్రి మూవీ మేక‌ర్స్.. ఊహ‌కంద‌ని క‌థ‌తో సినిమా

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కాదుకాదు.. నేష‌న‌ల్‌స్టార్ ప్ర‌భాస్ అంటేనే బాగుంటుందేమో. ఎందుకంటే మ‌న డార్లింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫేమ‌స్ అయిపోయాడు క‌దా. అన్ని భాష‌ల్లో ఆయ‌న‌కు ఇప్పుడు అభిమానులు ఉన్నారు. ఏ సినిమా తీసినా అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని తీయాలి కాబ‌ట్టి ఇప్పుడు అంద‌రు డైరెక్ట‌ర్లు అలాగే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

 

ఇక డార్లింగ్ ఇప్పుడు రాధేశ్యామ్‌, స‌లార్‌, ఆదిపురుష్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం కొవిడ్ కార‌ణంగా ఈ సినిమాల షూటింగులు వాయిదా ప‌డ్డాయి. దాంతో ప్ర‌భాస్‌కు రెస్ట్ దొరికింది.

అయితే దొరికిన ఈ రెస్ట్‌లో మైత్రీ మూవీమేక‌ర్స్ ఓ సెన్సేష‌న‌ల్ ప్రాజెక్టుతో ప్ర‌భాస్ ముందుకు వ‌చ్చారు. డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ యేలేటితో ప్ర‌భాస్ హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాహసం లాంటి కొత్త త‌ర‌హా క‌థ‌తో అంద‌రినీ మెస్మ‌రైజ్ చేసిన యేలేటితో మ‌రో కొత్త క‌థ‌ను రాయిస్తున్నారు. ఈ క‌థ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక ప్ర‌భాస్ దీనికి ఓకే చెబితే మాత్రం ఫ్యాన్స్‌కు మ‌రో గిఫ్ట్ ఇచ్చిన‌ట్టే.