బిగ్‌బాస్ సీజన్ 3కి హోస్ట్ దొరికారోచ్..!

ఫస్ట్ సీజన్‌లో చేసిన ఎన్టీఆర్ కూడా మూడో సీజన్‌కు హోస్ట్‌గా ఒప్పుకోలేదట. రెండో సీజన్‌కు హోస్ట్‌గా చేసిన నాని కూడా మూడో సీజన్ అనే సరికి చేతులెత్తేశారట. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 3 హోస్ట్ కోసం చాలామంది సెలబ్రిటీలను జల్లెడ పట్టారు.

అవును.. బిగ్‌బాస్ సీజన్ 3కి హోస్ట్ దొరికేశారు. ఇప్పటి రెండు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ రియాల్టీ షో మూడో సీజన్ కోసం బిగ్ బాస్ నిర్వాహకులు ఎట్టకేలకు హోస్ట్‌ను ఎంపిక చేశారు. చాలారోజుల నుంచి మూడో సీజన్ హోస్ట్ దొరకక పెండింగ్‌లో ఉంది. బిగ్‌బాస్ సీజన్ 3కి కంటెస్టెంట్లు కూడా ఎప్పుడో రెడీ అయిపోయారు. కానీ.. హోస్టే దొరకక సీజన్ 3ని పెండింగ్‌లో పెడుతూ వచ్చారు.

Nagarjuna will be the bigg boss season 3 host

ఫస్ట్ సీజన్‌లో చేసిన ఎన్టీఆర్ కూడా మూడో సీజన్‌కు హోస్ట్‌గా ఒప్పుకోలేదట. రెండో సీజన్‌కు హోస్ట్‌గా చేసిన నాని కూడా మూడో సీజన్ అనే సరికి చేతులెత్తేశారట. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 3 హోస్ట్ కోసం చాలామంది సెలబ్రిటీలను జల్లెడ పట్టారు. ముందు విజయ్ దేవరకొండ అనుకున్నారు. ఆ తర్వాత బిగ్‌బాస్ 2 ఫేమ్ కౌశలే సీజన్ 3 హోస్ట్ అన్నారు. కానీ.. వాళ్లెవరూ ఫిక్స్ కాలేదు. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవిని కూడా హోస్ట్‌గా అనుకున్నారట.

అయితే.. టీవీషోలలో ఇదివరకు అనుభవం ఉన్నవారైతే బెటర్ అనుకొని.. మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో పాపులారిటీ తెచ్చుకున్న కింగ్ నాగార్జున అయితే బాగుంటుందని అనుకున్నారో ఏమో.. చివరకు నాగార్జునను సీజన్ 3 కి హోస్ట్‌గా ఫిక్స్ చేశారట నిర్వాహకులు.

ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసుకున్నారని తెలుస్తోంది. మరికొందరి ఎంపిక ప్రక్రియ జరుగుతోందట. త్వరలోనే సీజన్ 3 ప్రారంభమవుతుందని తెలుస్తోంది.