Big Boss OTT Telugu: వెక్కివెక్కి ఏడ్చిన నటరాజ్ మాస్టర్..షాక్ అయిన కంటెస్టెంట్స్..అసలేం జరిగిందంటే?

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ ఆరో సీజన్..రసవత్తరంగా సాగుతోంది. తొమ్మిదో వారంలో కంటెస్టెంట్స్ గేమ్ చాలా చక్కగా ఆడుతున్నారు. సీక్రెట్ టాస్కును నటరాజ్ మాస్టర్ పూర్తి చేశాడు. అసలు ఎవరికీ అనుమానం రాకుండా ‘బిగ్ బాస్’ ఇచ్చిన కిల్లర్ టాస్క్ లో అదరగొట్టాడు. కానీ, చివరలో నటరాజ్ మాస్టర్ కెప్టెన్సీ దక్కకపోవడంతో కంటతడి పెట్టాడు.

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య..కెప్టెన్ అయ్యామా? లేదా ? అన్నట్లు బాబా భాస్కర్ మాస్టర్ కెప్టెన్ అయిపోయారు. దాంతో నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నదని స్పష్టమవుతున్నది. అయితే, బుధవారం ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్ వెక్కి వెక్కి ఏడ్వడం చూసి కంటెస్టెంట్స్ కొందరు షాక్ అయ్యారు. అయితే, కొందరు మాత్రం ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయిన నటరాజ్ మాస్టర్ మళ్లీ కెప్టెన్సీ రాలేదని ఏడ్వడం సరికాదని అనుకున్నారు.

అయితే, సీక్రెట్ టాస్కులో భాగంగా ‘కిల్లర్’గా నటరాజ్ మాస్టర్ అదరగొట్టేశాడన్న సంగతి అందరూ ఒప్పుకుంటున్నారు. బిందు మాధవి సైతం నటరాజ్ మాస్టర్ ఆటను మెచ్చుకుంది.

హమీద, బిందు మాధవి ఇప్పటి వరకు ఒక్క సారి కూడా కెప్టెన్సీ దక్కించుకోలేదు. అయినప్పటికీ వారు పెద్దగా ఏం బాధపడటం లేదు. కానీ, నటరాజ్ మాస్టర్ అలా ఏడ్చేయడం ఏంటనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news