చిరకాల ప్రేమికులు నయనతార, విగ్నేష్ శివన్ వివాహ ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 9వ తేదీన చెన్నైలో వీరి పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ జంట సీఎం స్టాలిన్ ను కలిసి పుష్పగుచ్చాన్ని అందించింది. తమ పెళ్లికి రావాలని ఆహ్వానిస్తూ శుభలేఖను అందజేశారు. వీరి వెంట నటుడు, నిర్మాత, సీఎం స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాలకు చేరింది.
చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ఓ రిసార్ట్ లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. తమ పెళ్లి గురించి నయనతార గతేడాది బయట పెట్టడం తెలిసిందే. ఆమె చేతికి ఉంగరం ఉండడంతో ఓ టీవీ యాంకర్ ప్రశ్నించగా.. విగ్నేష్ శివన్ తో ఎంగేజ్మెంట్ అయినట్లు ఆమె వెల్లడించింది.’ నానుమ్ రౌడీదాన్ ‘ సినిమా నుంచి విగ్నేష్,నయన్ ల మధ్య ప్రేమ నడుస్తోంది.