ప్రియాంకా, నిక్ జోనాస్ ల పచ్చని కాపురంలో నిప్పులు పోసేలా న్యూయార్క్ మేగజైన్ ఓ కథనం ప్రచురించింది. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న నిక్ జోనాస్, ప్రియాంకాలు డిసెంబర్ 2న పెళ్లితో ఒకటయ్యారు. ఇలా పెళ్లి చేసుకున్నారో లేదో అలా వారి రిలేషన్ మీద అబాండాలు వేస్తూ సంచలన కథనాన్ని ప్రచురించింది న్యూయార్క్ మేగజైన్. అమెరికన్ పాప్ సింగర్ అయిన నిక్ జోనాస్ కేవలం ఎంజాయ్ చేసేందుకే ప్రియాంకాని ప్రేమించాడని.. కాకపోతే ప్రియాంకానే వారి రిలేషన్ ను పెళ్లి దాకా తెచ్చిందని ఆ వార్త కథనం సారాంశం.
ఎంచక్కా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న ఈ జంటకి ఈ కథనం షాక్ ఇచ్చింది. నిప్పు లేనిదే పొగ రాదని కొందరు అంటుంటే సెలబ్రిటీస్ మీద ఏం రాసినా అది ఓ సెన్సేషనే అంటూ కొందరు అనుకుంటున్నారు. ఇక ఇలాంటి వార్తలు రాయడం సిగ్గు చేటని నిక్ జోనాస్ సోదరుడు జో జోనాస్ అన్నారు. వారిద్దరి ప్రేమించుకుని పెళ్లాడిన విషయం తెలిసి కూడా ఇంత దారుణంగా వార్తలు రాయడం ఎంతవరకు కరెక్టో ఆ మేగజైన్ వారికే తెలియాలి.
ఆ మేగజైన్ వెబ్ సైట్ లో కూడా ఈ కథనం ప్రచురించడంతో సెలబ్రిటీస్ కామెంట్స్ వల్ల వెబ్ సైట్ నుండి దాన్ని తొలగించారు. ప్రియాంకా, నిక్ జోనాస్ లు కూడా ఈ విషయం పై ఆ మేగజైన్ మీద మండి పడుతున్నారు.