క్రేజీ బజ్..బాలయ్య ‘అన్‌స్టాపెబుల్ విత్ ఎన్‌బీకే’ సీజన్ 2లో గెస్ట్‌గా తారక్!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలయ్య ప్రజెంట్ ..NBK 107 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘అఖండ’ ఫిల్మ్ తో అఖండమైన విజయం పొందిన బాలకృష్ణ రెట్టింపు ఉత్సాహంతో తదుపరి సినిమాలు చేస్తు్న్నారు. మరో వైపున తొలి తెలుగు ఓటీటీ ఆహాతో AHA డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు.

‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’ షోతో బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోతున్నారు. ఈ షోలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు హాజరు కాగా, వారి అంతరంగాలను అత్యద్భుతంగా తనదైన శైలిలో ఆవిష్కరించారు బాలయ్య. భారతదేశంలోనే నెంబర్ వన్ టాక్ షోకు ఈ షోకు బాలయ్య పేరు తీసుకొచ్చారు. కాగా, ఈ షో సెకండ్ సీజన్..ను కూడా తీసుకొస్తున్నట్లు ఇటీవల అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

ఈ క్రమంలోనే ఈ షో రెండో సీజన్ కు వచ్చే అతిథులెవరు? అనే విషయమై ఆసక్తికర చర్చ సాగుతున్నది. మెగాస్టార్ చిరంజీవి వస్తారని కొద్ది రోజుల కిందట వార్తలు వచ్చాయి. తాజాగా వస్తున్న బజ్ ప్రకారం..ఈ షోలో గెస్ట్ గా RRR హీరో …నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారని వార్తలొస్తున్నాయి.

అలా మొత్తంగా బాబాయ్-అబ్బాయి సంభాషణలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ నందమూరి అభిమానుల్లో నెలకొంది. అయితే,ఈ విషయమై అధికారికంగా సమచారం అయితే లేదు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే ’ టాక్ షో సీజన్ టూ ఆహాలో స్ట్రీమ్ కానుంది. తారక్ తర్వాత ఈ షోకు అతిథులుగా వెంకటేశ్, నాగార్జున, ప్రభాస్ కూడా వస్తారని తెలుస్తోంది.