థియేటర్‌లో దారుణం..KGF2 చూస్తుండగా కాల్పులు..పరుగులు తీసిన ప్రేక్షకులు..ఎక్కడంటే?

ఈ నెల 14న విడుదలైన KGF2 పిక్చర్ ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. థియేటర్స్ అన్నీ హౌజ్ ఫుల్ అవుతున్నాయి. జనాలు సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. కాగా, తాజాగా KGF2 ప్రదర్శితమవుతున్న టాకీసులో అవాంఛనీయమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ ఘటనతో అభిమానులు, సినీ ప్రేక్షకులు ఉలిక్కి పడ్డారు.

ఓ వైపున థియేటర్ లోని స్క్రీన్ పైన హీరో, విలన్ మధ్య కాల్పులు, పోరాట సన్నివేశాలు చూస్తూ ప్రేక్షకులు సంబురపడుతూ, ఉద్వేగానికి గురవుతున్నారు. మరో వైపున అటువంటి ఘటన నిజంగానే థియేటర్ లో జరగడంతో ఒక్కసారిగా జనాలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. కర్నాటక స్టేట్‌లోని హావేరి జిల్లా శిగ్గావి పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

kgf
kgf

టాకీసులో సెకండ్ షో రన్ అవుతున్న క్రమంలో ఓ ప్రేక్షకుడి కాలు ముందు సీటులో ఉన్న ప్రేక్షకుడికి తగిలింది. అలా గొడవ కాస్త పెద్దది అయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వ్యక్తి బయటకు వెళ్లి గన్ తీసుకొచ్చుకున్నాడు. అందరూ థియేటర్ లో సినిమా చూసి నిమగ్నమై ఉన్న క్రమంలో ఒక్కసారిగా అతనిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం పరారయ్యాడు ఆ దుండగుడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దుండగుడి కోసం గాలిస్తున్నారు.